కమెడియన్ కమ్రాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముంబయిలో ఆదివారం నిర్వహించిన షోలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ఉద్దేశిస్తూ జోకులు పేల్చారు. శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది.. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది.. అంతా గందరగోళంగా ఉంది మరాఠా రాజకీయాల గురించి మాట్లాడారు. అలాగే, షిండే ద్రోహిగా అభివర్ణించించిన కునాల్.. దిల్ తో పాగల్ హై అనే బాలీవుడ్ సినిమా పాటలోని చరణాలను రాజకీయాలను అనుగుణంగా మార్చి వ్యంగ్యంగా పాడారు.
భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో కొందరు దేశాన్ని ముక్కలు చేయడం, విభజనను విస్తృతం చేయడం తమ జన్మహక్కుగా భావిస్తున్నారు అని యోగి మండిపడ్డారు.
అమెరికా కుబేరుడు జార్జ్ సోరెస్ నుంచి తీసుకున్న డబ్బుతో 2024 లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. అలాగే, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4 శాతం కోటా బిల్లును తీసుకొచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించిందని ధ్వజమెత్తారు.
Also Read:ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

