పిల్లల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని తల్లి.. వీడియో

204
Amazing Mother

అమ్మ అంటే అమృత బాండం.. అమ్మ అంటే ప్రేమకు ప్రతిరూపం. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. అయితే అమ్మ అనే పదం ఒక మనుషులకే కాదు.. ప్రతి ప్రాణికి కూడా అమ్మలే. వాటికి కూడా ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. అందుకే తల్లిని దైవంతో సామానం అంటాం. ప్రస్తుతం మనం చూడబోయే వీడియో మాతృ ప్రేమకు నిదర్శనం.

ఓ పక్షి తను పెట్టిన గుడ్లను కాపాడుకునేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. ఆ పక్షి తన గుడ్లను పొదిగింది. అదే ప్రాంతం నుంచి పొలం దున్నే ఓ ట్రాక్టర్ వెళ్తుంటుంది. పక్షి అక్కడున్న విషయాన్ని ఆ వాహనం డ్రైవర్ గమనించకుండా దాన్ని అలాగే పోనిస్తాడు. అయినా కూడా ఆ పక్షి మాత్రం అక్కడి నుంచి కదలదు. ట్రాక్టర్ తన మీది నుంచి వెళ్తే.. చనిపోతా అని తెలిసినా అది మాత్రం అక్కడి నుంచి కదలదు. తను పెట్టిన గుడ్లను తన రెక్కలతో రక్షిస్తూ అలాగే అక్కడే ఉండిపోతుంది. తర్వాత ఈ విషయాన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్.. ట్రాక్టర్ కింద పక్షి పడకుండా నెమ్మదిగా తీసుకెళ్తాడు. దీంతో పక్షి ప్రాణాలతో బయటపడుతుంది. అమ్మతనానికి, మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ ఒక్క వీడియో చాలు.. తన పిల్లల కోసం తల్లి ఎంతలా కష్టపడుతుందో. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.