పాము ఆత్మహత్య చేసుకుంది…!

244
Snake suicide in australia
- Advertisement -

ఇదేంటీ పాము ఆత్మహత్య చేసుకోవడం ఏంటనుకుంటున్నారా…! అవును నిజమే. మనుషులే కాదు జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయట.  ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన సర్పం ఆత్మహత్యకు పాల్పడింది. పాములు పట్టడంలో నిపుణుడైన మెంట్‌హెగెన్ సమక్షంలో ఈ ఘటన చోటుచేసుకుందట. కెయిరిన్స్ పట్టణంలోని నివసించే స్నేక్ హంటర్ మెంట్‌ హెగెన్‌కు… తన ఇంట్లో 1.5 మీటర్ల పాము ఉందని, సుమారు రెండు గంటల నుంచి అది అక్కడే ఉందని ఆందోళన చెందుతూ ఎర్వెల్లేకు చెందిన ఓ మహిళ ఫోన్ చేసింది.

దీంతో ఆయన హుటాహుటీన ఆమె చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ట్రీ బ్రౌన్ జాతి సర్పం ఉంది. దానిని మెంట్ హెగెన్ పట్టుకున్నాడు. ఆయన అలా పట్టుకోగానే, ఆ పాము తనంతట తాను తన నోటితో మెడపై కాటు వేసుకుంది. దీంతో విషం వ్యాపించి మరణించింది.

నేషనల్ కోరినల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆస్ట్రేలియాలో ఏటా సంభవించే మరణాల్లో సగం మంది పాముకాటు వల్లేనని తేలింది. ఇవి కాటువేస్తే ఎలాంటివారైనా నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతారు. అత్యంత విషపూరితమైన ట్రీ బ్రౌన్ అనే ఒక పాము ఆత్మహత్య చేసుకోవడం నిపుణులను సైతం ఆందోళనకు గురిచేసింది.

- Advertisement -