మొబైల్స్ తో జాగ్రత్త గురూ !

53
- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరి దగ్గర మొబైల్స్ తప్పనిసరిగా ఉంటాయి. ప్రస్తుతం మొబైల్ యొక్క అవసరం కూడా పెరిగిపోవడంతో చేతిలో మొబైల్ లేనిదే రోజు గడవని పరిస్థితి. అయితే మొబైల్ ఎక్కువసేపు వాడడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని తెలిసిన వాడక తప్పని పరిస్థితి. సాధారణంగా మొబైల్ ఎక్కువసేపు వినియోగిస్తే హ్యాంగ్ అవ్వడం లేదా ఫోన్ వేడెక్కడం జరుగుతుంది. .

ఇలాంటి సమయాల్లో మొబైల్ బ్యాటరీపై అధిక ఒత్తిడి పెరిగి ఫోన్ పేలిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేటి రోజుల్లో మొబైల్స్ పేలుతున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. సాధారణంగానే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మొబైల్స్ వేడెక్కడం మామూలే.. అలాంటిది వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు మొబైల్ జేబులో పెట్టుకోవడం వల్లనో, లేదా ఎండలో మొబైల్స్ ఎక్కువగా వాడడం వల్లనో, ఎక్కువసేపు చార్జింగ్ పెట్టడం వల్లనో మొబైల్ సాధారణ టెంపరేచర్ కంటే రెట్టింపు అవుతుంది. దానికి తోడు వాతావరణంలో కూడా టెంపరేచర్ అధికంగా ఉండడం వల్ల ఫోన్లు పేలే ప్రమాదం ఉంది. అందువల్ల వేసవిలో మొబైల్స్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: వైలోప్పిల్లీ…కేరళ సాహిత్యాభ్యుదయ రచయిత

ఈ వేసవిలో పోన్ పై నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. అంతే కాకుండా వేడిని పుట్టించే వాటికి మొబైల్స్ ను దూరంగా ఉంచడమే మంచిది. అలాగే చాలా మంది చార్జింగ్ పెట్టె ఫోన్ మాట్లాడడం లేదా గేమ్స్ ఆడడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం అత్యంత ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా రైల్వే స్టేషన్స్ లోనూ బస్ స్టేషన్స్ లోనూ ఈ రకంగా చేస్తుంటారు చాలామంది. అసలే వేసవి కావడం వల్ల వేడి వాతావరణంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం వంటివి చేస్తే మొబైల్ పేలిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే అలా అసలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ వేడెక్కుతున్నట్లు గమనిస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది.ఇక చాలామంది చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్స్ కింద మెత్తని గుడ్డముక్క లేదా ఏవైనా మెత్తటి వస్తువులు పెడుతుంటారు. అలా పెట్టడం కూడా ప్రమాదమే. ఎందుకంటే చార్జింగ్ పెట్టేటప్పుడు మొబైల్ వేడి కారణంగా మెత్తని గుడ్డ ముక్కపై మంటలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వేసవిలో మొబైల్ వాడకంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: అదే సీన్ రిపీట్ ?.. మరి భయమెందుకు ?

- Advertisement -