భారీ ఆధిక్యంలో టీమిండియా..

41
- Advertisement -

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, తొలి టెస్టు ఆడుతున్న యశస్వీ జైస్వాల్ సెంచరీలతో రాణించారు.

సెంచరీ పూర్తయిన మరుసటి బంతికే రోహిత్ శర్మ పెవిలియన్ చేరగా శుభ్‍మన్ గిల్ కేవలం ఆరు పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. అయితే తర్వాత మరో వికెట్ పడకుండా విరాట్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు జైస్వాల్. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (36 నాటౌట్), యశస్వీ జైస్వాల్‌ (143 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

ఇక ఈ టెస్టు ద్వారా పలు రికార్డులు సృష్టించింది. ఆసియా అవతల టెస్టుల్లో తొలి వికెట్‌కు భారత్ సాధించిన అత్యధిక పరుగులు (రోహిత్- యశస్వీ 229) ఇవే కావటం గమనార్హం. 1979లో ఇంగ్లాండ్ జట్టుపై చేతన్ చౌహాన్ – గవాస్కర్ 213 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Also Read:Dasoju Sravan:రేవంత్ కాంగ్రెస్‌కు పట్టిన శని

అరంగ్రేట టెస్టులోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు. విదేశీ గడ్డపై ఓపెనర్‌గా అరంగ్రేటంలో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అరంగ్రేటంలోనే సెంచరీ సాధించిన పదిహేడో భారత బ్యాటర్ యశస్వీ. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన మూడో ఓపెనర్ యశస్వీ జైస్వాల్.

Also Read:పవన్‌కు వాలెంటరీ ఎఫెక్ట్..?

- Advertisement -