రివ్యూ : The Family Man 2

140
sam

ఓటీటీలో అత్యంత టాప్ రేటింగ్‌‌ను సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం…

కథ:

భారత్ -శ్రీలంక -లండన్ చుట్టూ కథ తిరుగుతుంది. ఎల్టీటీఈ తరాహాలోనే శ్రీలంకలో తమిళ నాయకుడు భాస్కరణ్ దళాన్ని మట్టుబెట్టేందుకు ఆ దేశానికి భారత్ సాయం చేస్తుంది. ఈ క్రమంలో అక్కడి నుంచి భాస్కరణ్ తప్పించుకుంటారు. అతని తమ్ముడు (సుబ్బు)ని అప్పగించాలని లేదంటే చైనాతో తాము వ్యాపార ఒప్పందం చేసుకుంటామ శ్రీలంక…భారత్‌ని బెదిరిస్తుంటుంది. అయితే ఈ క్రమంలో జరిగే ఓ బాంబు పేలుడులో సుబ్బు చనిపోతాడు. దీంతో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ మేజర్‌తో చేయి కలుపుతాడు భాస్కరణ్. ఆతర్వాత ఏం జరుగుతుంది అనేది మొత్తం 9 ఎపిసోడ్‌లుగా సాగే వెబ్ సిరీసే ది ఫ్యామిలీ మ్యాన్ 2.

ప్లస్ పాయింట్స్‌ :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నటీనటులు. మనోజ్ భాజ్ పెయీ, సమంత, ప్రియమణి తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఇక ముఖ్యంగా సమంతా తన విశ్వరూపం చూపించింది. డీ గ్లామర్ రోల్ అయినా తన నటనతో కట్టిపడేసింది, ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో సమంత నటన సూపర్బ్.

సాంకేతిక విభాగం‌:

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యారు. నేపథ్య సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

తీర్పు:

తమిళనాడు నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ది బెస్ట్ వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. ఫస్ట్ పార్ట్‌ని మించి సెకండ్ పార్ట్‌ని తెరకెక్కించారు. మొత్తంగా ద ఫ్యామిలీ మ్యాన్‌ 2తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది చిత్రయూనిట్.

విడుదల తేదీ:04/06/2021
రేటింగ్:3/5
నటీ నటులు:మనోజ్ భాజ్ పెయీ,సమంత,ప్రియమణి
దర్శకుడు: రాజ్ అండ్ డీకే