మరోసారి సామాన్యుడిలా…కేటీఆర్‌పై ప్రశంసలు..!

272
KTR

ఐటీశాఖమంత్రి కేటీఆర్‌ ఇప్పుడో యూత్‌ ఐకాన్‌..యంగ్‌ జనరేషన్‌కి ఆయన మాటలు ఓ సిద్దాంతం. ఎందరో యువనేతలు ఆయన్ని స్పూర్తిగా తీసుకుంటుంటారు. ఎంత పెద్ద హోదాలోఉన్నా.. సామాన్యుడిలానే వ్యవహరించే కేటీఆర్ ఇప్పుడు మరోసారి సామాన్యుడిలా మారి ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.

KTR

కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణి ని ఆపారు. బైక్ పై వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కేటీఆర్ ను చూసి విష్ చేయగా వెంటనే కారునుంచి దిగి ఆమెను పలకరించారు కేటీఆర్‌. అయితే కేటీఆర్ తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా..వెంటనే ఆమెతో సెల్ఫీ దిగారు.

KTR

కాగా..వైష్ణవి తో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్ తో సెల్ఫీ లు దిగడానికి ఉత్సాహపడడంతో…తానో సీఎం కొడుకని, కీలక శాఖల మంత్రిననే అధికార దర్పం ప్రదర్శించకుండా వారందరితో సెల్ఫీలు దిగి సామాన్యుడిలా వ్యవహరించిన కేటీఆర్ తీరుపై ఎంతోమంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.