ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా : రకుల్‌

194

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకూల్‌ ప్రీత్‌సింగ్‌ బాంబ్‌ పేల్చింది. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానంటూ చెప్పకొస్తోంది. ఆల్‌మోస్ట్ అగ్రహీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఉన్నట్టుండి అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం..ఆపర్లు తగ్గడమే.

rakul

ఇటు తెలుగుతోపాటు అటు తమిళంలోనూ ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. దాంతో ఈ పంజాబీ బేబీ టైం వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఈ రోజు ఉన్న ఫేమ్, రేపు ఉండకపోవచ్చు వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు పరుగు ఎప్పుడు ఆపాలో తెలుసని… ఆడియెన్స్‌కి తాను బోర్ కొడుతున్నానని అనిపించినప్పుడు తనంతట తానే ఇండస్ట్రీకి దూరమవుతానని తెలిపింది.