ఆకట్టుకుంటున్న ‘తండేల్’ గ్లింప్స్

28
- Advertisement -

‘తండేల్’ చిత్ర యూనిట్ ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకొని చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇప్పుడు సినిమా షూటింగ్ ప్రాసస్ ని ఆస్వాదిస్తోంది. సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి, తాజాగా‘తండేల్’ సారాంశాన్ని ఆవిష్కరించి విజువల్ ట్రీట్‌ను అందించారు మేకర్స్. చేపలు పట్టడానికి సముద్రం మధ్యలో వున్న యువ సామ్రాట్ నాగ చైతన్య పాత్రను పరిచయం చేయడంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఈపాలి యేట..గురి తప్పేదెలేదేస్…ఇక రాజులమ్మ జాతరే’ అని చైతు చెప్పిన మ్యాసీ డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించింది. అయితే అనుకోకుండా, వారు పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు, వారిని కరాచీలోని సెంట్రల్ జైలులో బంధిస్తారు, అక్కడ వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. జైలర్ జాతీయవాదాన్ని ప్రశ్నించినప్పుడు, కథానాయకుడు “మా నుండి ఊడిపోనా ఒక ముక్క… మీకే అంతుంటే.. ఆ ముక్కని ముష్టేసిన మాకెంతుటుంది… భారత్ మాతా కీ జై…” అని జైలర్ కి తగిన సమాధానం ఇస్తాడు.

రాజు ప్రేమికురాలిగా సాయి పల్లవి పోషించిన బుజ్జి తల్లి పాత్రని పరిచయం చేయడంతో గ్లింప్స్ ఆహ్లాదకరంగా ముగుస్తుంది.126-సెకన్ల క్లిప్ రాజు ప్రపంచం, అతని రెండు విభిన్న పార్శ్వాలను చూపిస్తోంది. ఇది పాకిస్తాన్ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుని గురించి. ప్రేమకథను కూడా చాలా అందంగా ప్రజెంట్ చేశారు. ‘తండేల్’ సారాంశం నిజంగా అద్భుతమైనది. ఇది శాశ్వత ముద్రని వేసుకుంటుంది.

నాగ చైతన్య మునుపెన్నడూ చూడని రస్టిక్ అవతార్‌లో కనిపించారు. శ్రీకాకుళం యాసని అద్భుతంగా పలికారు. చైతు ప్రీ-ప్రొడక్షన్‌కి మంచి సమయాన్ని కేటాయించాడు, ఇందులో మాండలికం,బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ రావిష్‌నెస్‌ని తన ఫిజిక్‌, డైలాగ్స్‌లో చూపించారు. సాయి పల్లవి అందంగా కనిపించింది. ప్రేమకథ నెక్స్ట్ లెవల్ లో వుంది. వీరిద్దరూ కలిసి కనిపించనప్పటికీ, చైతు మాటలు, సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్ ద్వారా సినిమాలో వీరిద్దరూ ఎలాంటి కెమిస్ట్రీని పంచుకున్నారో గ్రహించవచ్చు. సన్నివేశాలు పెయింటింగ్ లాగా రూపొందించబడ్డాయి. ఇది ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌ను అందిస్తోంది.

దర్శకుడు చందూ మొండేటి గ్లింప్స్ ద్వారా కోర్ పాయింట్‌ని వెల్లడించి, చాలా లేయర్‌లు ఉన్న సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తన నైపుణ్యాన్ని చూపించారు. చివరి పోర్షన్లలో ప్రేమకథను ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతం. ఓవరాల్‌గా, దర్శకుడు మనల్ని అద్భుత ప్రపంచంలో తీసుకెళ్లి, కథనంలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో విజువల్ ఎక్స్‌ట్రావాగాంజా అందించాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నిర్మాణంతో పాటు సాంకేతిక ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ గీతా ఆర్ట్స్ మార్క్ లో అద్భుతంగా వుంది. షామ్‌దత్ తన ఫ్రేమ్‌లతో హై విజువల్ క్వాలిటీని అందించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆకట్టుకునే నేపధ్య సంగీతం, ముఖ్యంగా ప్రేమకథకు మరింత ఆకర్షణని తీసుకొచ్చింది. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

గ్లింప్స్ అంతా అత్యద్భుతంగా ఉంది. ఈ క్లిప్‌తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది దృశ్యకావ్యంగా మనసు హత్తుకుని థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించింది. ఇది భావోద్వేగాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోంది.

Also Read:గీతాంజలి మళ్ళీ వచ్చింది..ఎంజాయ్ చేస్తారు

- Advertisement -