డ్రై ఆమ్లా తింటే.. ఎన్ని ఉపయోగాలో!

42
- Advertisement -

ఆమ్లా గురించి మనందరికి తెలిసే ఉంటుంది. దీనిని తెలుగులో ఉసిరికాయ అంటారు. శీతాకాలంలో మాత్రమే దొరికే ఉసిరిని ఎంతో ఇష్టంగా తింటూఉంటారు. దీనితో పచ్చళ్లు, చట్నీ, జ్యూస్ వంటివి తయారు చేసుకొని ఎంతో ఇష్టంగా సేవిస్తూ ఉంటారు. అయితే శీతాకాలం ముగిస్తే ఉసిరి కాయలు మళ్ళీ వచ్చే సీజన్ వరకు ఎక్కడ కనిపించవు. అయితే ఎండబెట్టిన ఉసిరికాయలు ( డ్రై ఆమ్లా ) మాత్రం మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి. డ్రై ఆమ్లాలో కూడా సాధారణంగా వాటిలో ఉండే పోషకాలాన్ని ఉంటాయి. అందుకే డ్రై ఆమ్లాను ఆయుర్వేద ఔషదాల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఎండబెట్టిన ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. .

అలాగే ఉసిరిలో ఉండే సి విటమిన్ సాధారణంగానే అధికంగా ఉంటుంది. కాబట్టి డ్రై ఆమ్లా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల ఇన్ ఫెక్షన్లు, ఇతరత్రా వ్యాధులు దారి చెరకుండా ఉంటాయి. రోజుకు రెండు లేదా మూడు ఎండిన ఉసిరి ముక్కలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే కాకుండా మలబద్దకం సమస్య కూడా దూరం అవుతుంది. ఇక డ్రై ఆమ్లా తినడం వల్ల తల వెంట్రుకలు బలం పెంచుకుంటాయి.

Also Read:Adipurush:రెండోరోజు వసూళ్లివే

కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా మారి.. పొడవుగాను కాంతి వంతంగాను మారతాయి. ఇక మొఖంపై ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలు వంటివి తగ్గడంలో కూడా డ్రై ఆమ్లా చక్కగా ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక షుగర్ వ్యాధితో బాధ పడేవాళ్లు కచ్చితంగా డ్రై ఆమ్లా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పైటో కెమికల్స్ చక్కెర వ్యాధిని అదుపులో ఉంచడంలో సహాయ పడతాయి. ఇక గుండె సమస్యలను దూరం చేయడంలో కూడా డ్రై ఆమ్లా సహాయ పడుతుందట. ఇంకా రోజుకు 2- 3 డ్రై ఆమ్లా ముక్కలను తినడం వల్ల మతిమరుపు, వణుకు, వంటి సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:దూకుడు పెంచిన బి‌ఆర్‌ఎస్..?

- Advertisement -