తగ్గిన నేరాలు..17 జైళ్ల మూసివేత

264
telangana jails

స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఓ వైపు సంక్షేమం మరోవైపు అభివృద్ది రెండింటిని జోడెడ్లుగా పరుగులు పెట్టిస్తున్నారు సీఎం కేసీఆర్. అన్నిరంగాల్లో అభివృద్ధిలో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన తెలంగాణలో నేరాల సంఖ్య తగ్గిపోయింది.

వినూత్న కార్యక్రమాలతో నేరస్తుల్లో మార్పులు తీసుకొచ్చామని దేశంలోని అన్నిరాష్ట్రాల కంటే తెలంగాణ జైళ్ల శాఖ మెరుగైన స్ధానంలో ఉందని డీజీ వీకే సింగ్ తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో ఉన్న 49 సబ్ జైళ్లలో 17 మూసేశామని చెప్పారు.

మూసివేసిన జైళ్లను సామాజిక కేంద్రాలుగా మార్చాలని భావిస్తున్నామని తెలిపారు వీకే సింగ్. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న 18 పెట్రోల్ బంకులకు తోడుగా మరో 20 ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జైలు నుంచి విడుదలైన వెయ్యి మందితో జాబితా రూపొందించామన్నారు.

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్‌ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టించేలా ప్లాన్ చేస్తున్నామరు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు.