తెలంగాణ విద్యార్థి ప్రశ్న..మోదీ ఆన్సర్

45
- Advertisement -

పరీక్షలు సమీపిస్తోన్న వేళ భారత ప్రధాని మోదీ విద్యార్థుల్లో ఒత్తిడిని తొలిగించేందుకు శుక్రవారం విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ప్రధాని మోదీ పరీక్షా పే చర్చలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీకి ప్రశ్న వేసింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాలని అడగ్గా…దీనిపై మోదీ ఉదాహరణను తో సహా వివరించారు.

కార్మికులు నివసించే బస్తీలోని ఒక ఎనిమిదేళ్ల చిన్నారి..మలయాళం మరాఠీ హిందీ బెంగాలీ తమిళం మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచింది. అసలు ఈ బాలికకు అన్ని భాషలు మాట్లాడటం ఎలా సాధ్యమైందని ఆరా తీశాను. ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వ్యక్తులు ఒక్కో రాష్ట్రానికి చెందినవారు ఎక్కిడి నుండో వచ్చి…వారంతా ఒక దగ్గర నివసించడంతో ఆ బాలిక వారితో నిత్యం మాట్లాడటం వల్ల భాషలను నేర్చుకుంంది. ఆ క్రమంలోనే ఆమెకు అన్ని భాషలు వచ్చాయి. ఆ చొరవ మెచ్చుకోదగినది ఇతర భాషలు నేర్చుకోవడానికి ప్రత్యేక అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు.

నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు. అని సమాధానం ఇచ్చారు. ఈ యేడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం కోసం 38లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోదీ నివృత్తి చేశారు.

ఇవి కూడా చదవండి…

లోకేశ్ పాదయాత్ర.. ఎవరికి దడ ?

వైరల్‌…మద్యం కేసులో చిలుక విచారణ

ఏపీలో ఫ్యామిలీ డాక్టర్లు.. !

- Advertisement -