రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 379 మంది కోలుకున్నారు.
మొత్తం 1577 మంది బాధితులు వైరస్ ప్రభావంతో మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో 2,395 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.02 శాతంగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉన్నదని వెల్లడించింది.
రాష్ట్రంలో శనివారంనాడు 33,298 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, దీంతో ఇప్పటివరకు మొత్తం 74,61,687 నమూనాలను పరీక్షించామని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 57, మేడ్చల్ మల్కాజిగిరిలో 26, కరీంనగర్‌లో 24 కేసుల చొప్పున ఉన్నాయి.