రాష్ట్రంలో మూడురోజుల పాటు వర్షాలు..

87
Telangana rains

పశ్చిమ రాజస్థాన్ మరియు పంజాబ్ లలో కొన్ని ప్రాంతాల నుండి ఈరోజు(సెప్టెంబరు 28 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ఉపసంహరించాయి. రాగల 2 నుండి 3 రోజులలో రాజస్థాన్ మరియు పంజాబ్‌లలో మరికొన్ని ప్రాంతాలు హర్యానా, చండీఘర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల నుండి నైఋతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కాగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 4.5 కీ.మీ నుండి 5.8 కీ.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఇక తూర్పు బీహార్ మరియు దానిని ఆనుకొని ఉన్న సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతం వరకు గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ మరియు కోస్తా ఒరిస్సా మీదుగా 3.1 కీ.మీ ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలుచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది.