మొక్కలు నాటిన హీరో సంపూర్ణేష్ బాబు..

123
Sampoornesh Babu

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హీరో సంపూర్ణేష్ బాబు మొక్కలు నాటారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మూడు మొక్కలు నాటానని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్నరాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

కమెడియన్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో మొక్కలు నాటిన హీరో సంపూర్ణేష్ బాబు.. అనంతరం మరో ముగ్గురు (బిగ్ బాస్ సమీర్, సినీ దర్శకుడు స్టీల్ శంకర్, బిగ్ బాస్ జ్యోతి)లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.