మ్యానుఫ్యాక్చరింగ్‌లో తెలంగాణ నెంబర్ వన్…

38
- Advertisement -

వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తెలంగాణ నెంబర్ వన్ అన్నారు మంత్రి కేటీఆర్. మాదాపూర్ హెచ్.ఐ.సి.సి హోటల్ లో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం లో ముఖ్య అతిధి గా పాల్గొని FTCCI ఎక్సలెన్స్ 22 అవార్డులను అందజేశారు ఐటి శాఖ మంత్రి కె.టి.ఆర్. ఈ కార్యక్రమానికి ఐ.టి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జేఎస్ రంజన్ , గ్రీన్‌కో ఎండీ & గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ చలమలశెట్టి , అవార్డ్ గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు….

9 ఏళ్లలో లో తెలంగాణది సమగ్ర సమీకృత సమతుల్య అభివృద్ధి సాధించిందన్నారు. గతంలో ఉన్న రాజకీయ నాయకులు.. ఒకరు పట్టణ అభివృద్ధి, మరొకరు పల్లె అభివృద్ధి చేశారు కానీ కేసీఆర్ మాత్రం రెండు సమకూలంగా చేశారన్నారు. ప్రపంచానికి అవసరమైన వాక్సిన్ లలో 50 శాతం వాక్సిన్ లు తెలంగాణ లో తయారు చేస్తున్నాం అన్నారు.

Also Read:Worldcup:సెకండ్ ‘బెర్త్‌’ ఎవరికి?

ప్రతి ఒక్కరూ ఇతర దేశాల వస్తువులు వాడుతున్నారు.. కానీ మన వస్తువులు ఇతర దేశాల ప్రజలు ఎందుకు వాడడం లేదన్నారు.40 సంవత్సరాల జపాన్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దీనికి ముఖ్య కారణం అక్కడి ప్రజల స్మార్ట్ థింకింగ్ కారణం అన్నారు. రాష్ట్రాలతో కాదు పోటుపడాల్సిందే ప్రపంచంతో…ప్రతి ఒక్కరూ గ్లోబుల్ గా థింక్ చేయాలన్నారు. వచ్చేతరం ప్రజలైన వైడ్ గా ఆలోచించి స్మార్ట్ గా పని చేయాలి… తెలంగాణ ఎప్పుడు కొత్తవారికి ఆహ్వానం పలుకుతుందన్నారు. ఎలాంటి కంపెనీ కైనా తెలంగాణ అనుకూలంగా ఉంటుందన్నారు.

- Advertisement -