Worldcup:సెకండ్ ‘బెర్త్‌’ ఎవరికి?

44
- Advertisement -

2023 ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ సూపర్ సిక్స్‌లో జింబాబ్వేను చిత్తు చేసి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది శ్రీలంక. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 33.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 169 పరుగులతో శ్రీలంక విజయం సాధించింది. ఓపెనర్‌ నిస్సాంక (101 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించగా తొమ్మిది వికెట్లతో గెలుపొందింది శ్రీలంక. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. విలియమ్స్‌ (56) అర్ధ శతకంతో ఆదుకున్నాడు.

Also Read:Guru Pournami:గురు పూర్ణిమ విశిష్టత

ఇక ఈ గెలుపుతో శ్రీలంక 8 పాయింట్లతో ప్రపంచకప్‌కు అర్హత సాధించగా ఇంకొక బెర్త్ మాత్రమే మిగిలిఉంది. జింబాబ్వేకు రెండో బెర్త్ దక్కాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై తప్పక నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ స్కాట్లాండ్‌ చేతిలో జింబాబ్వే పరాజయం చవిచూస్తే..తదుపరి గురువారం జరిగే పోరులో నెదర్లాండ్స్‌ చేతిలో స్కాట్లాండ్‌ భారీ తేడాతో ఓడాల్సి ఉంటుంది. అలా అయితే మెరుగైన రన్‌రేట్‌ ద్వారా రెండో బెర్త్‌ జింబాబ్వేకు లభిస్తుంది.

Also Read:అవినీతికి కేరాఫ్‌ కాంగ్రెస్‌:కేటీఆర్ ఫైర్

- Advertisement -