డిజిటల్‌ ఇండియా కాన్‌క్లేవ్‌లో :కేటీఆర్‌

81
- Advertisement -

డిజిటల్‌ ఇండియా కాన్‌క్లేవ్‌ సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గడిచిన ఎనిమిదేళ్ల కాలంలో ఐటీ రంగంలో సాధించిన ఐటీ ఎగుమతులను, సాధించిన ప్రగతిని ఈ సదస్సులో వివరించారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడే టైర్‌- 2 పట్టణాలకు ఎస్‌టీపీఐలను కేటాయించాలని డిమాండ్‌ చేశారు.  తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన టీహబ్‌ వీహబ్‌ల ద్వారా న్యూ అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నమన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇ-గవర్నెన్స్‌ ను మీసేవా, ఈసేవా టీయాప్‌, టీవాలెట్‌ ద్వారా సులభతరం చేశామని గుర్తు చేశారు. తెలంగాణకు ఐటీఐఆర్‌-హైదరాబాద్‌ను కేంద్రం రద్దు చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

దేశంలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఆన్‌లైన్‌ అశ్లీలత ముప్పును అరికట్టే విధంగా ఐఎస్‌పీలను మరియు టెలికాం నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకొవాలని సూచించారు. యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తున్న ప్రజలకు…ఆన్‌లైన్‌లో జరిగే మోసాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

సైబర్‌ క్రైమ్‌ క్రమంగా అన్ని రంగాల్లో విస్తరిస్తునందున్న కఠిన చర్యలు తీసుకొవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోషల్‌ మీడియా ద్వారా జరిగే ఎటువంటి మోసాలైన వాటిని చట్ట పరంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలను తెవాలని కేంద్ర ప్రభుత్వంకు సిఫార్సు చేశారు.

- Advertisement -