పెట్టుబడులకు స్వర్గధామం:కేటీఆర్‌

174
- Advertisement -

తెలంగాణలో చిన్న మధ్య తరహా సంస్థలకు తెలంగాణ స్వర్గధామంగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈసందర్భంగా తైవాన్ వ్యాపార ప్రతినిధి బృందంను తెలంగాణలో ఉన్న చిన్న మధ్యతరహా సంస్థలకు సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.

తైవాన్ భార‌త‌దేశ ప్ర‌తినిధి బౌష‌న్ గేర్ ఆధ్వ‌ర్యంలో తైవాన్ వ్యాపార ప్ర‌తినిధి బృందం కేటీఆర్‌తో శుక్ర‌వారం స‌మావేశ‌మైంది. ఈ కార్యక్రమంలో రిచర్డ్‌ లీ చైర్మన్ ఆఫ్ తైవాన్ ఎలక్ట్రికల్ ఆండ్ ఎలాక్ట్రానిక్‌ మ్యాన్‌ఫ్యాక్ఛర్‌ అసోసియేషన్ కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో లైఫ్ సైన్సెస్, ఐసీటీ స‌హా శ‌క్తివంత‌మైన పారిశ్రామిక వ్య‌వస్థ తెలంగాణ‌లో ఉంద‌ని కేటీఆర్ తైవాన్ బృందానికి వివ‌రించారు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ పెట్టుబ‌డుల‌కు బాట‌లు వేసింద‌ని..పెట్టుబ‌డుల‌కు అనువైన గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ మారింది అని స్ప‌ష్టం చేశారు. పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని తైవాన్ బృందంను కోరారు. భారీ పెట్టుబ‌డుల‌తో వ‌స్తే పూర్తి స‌హాయ, స‌హ‌కారాలు అందిస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇవి కూడా చదవండి..

కన్నతల్లిని జన్మభూమిని మరువద్దు…సంతోష్‌

మీ ప్రేమతో..సమంత

ఆధార్ అప్‌డేట్‌ తప్పనిసరి..

- Advertisement -