మీ ప్రేమతో..సమంత

140
- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన చిత్రం యశోద. ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం హీందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశోద సినిమాను వన్‌ మ్యాన్‌ షోలా చేసిన సమంత చివరి వరకు తీవ్ర ఉత్కంఠత కొనసాగించింది. హరి-హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ ఫుల్‌ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా తన సంతోషాన్ని అందరితో పంచుకుంది.

యశోద సినిమా విడుదల నేపథ్యంలో సమంత ట్వీట్‌ చేస్తూ… అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసింది సమంత. గతంలో కంటే ఈసారి సినిమాను ప్రమోట్ చేయడంలో మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. యశోద సినిమాపై, నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాల పట్ల ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ సదా కృతజ్ఞతలు. మీరంతా నా కుటుంబం. మీరు నిజంగా నా సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చింది.

మణిశర్మఅందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రంలో రావు రమేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌ కీలకపాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి..

యాక్షన్ సన్నివేశాల్లో..నాగ్ బిజీ

రివ్యూ: యశోద

సూపర్‌ కాంబో మరోసారి….

- Advertisement -