తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రగతి నివేదిక ను ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు విడుదల చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ప్రగతి నివేదిక విడుదల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్న మంత్రి కెటియార్, ఆరోసారి రిపోర్ట్ ను ప్రజల ముందు ఉంచారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామారావు తెలంగాణ ఐటి రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని అన్నారు. ముఖ్యంగా జాతీయ సగటు ఐటీ ఎగుమతుల కన్నా ఎక్కువగా తెలంగాణ ఐటీ రంగం పురోగతి సాధించిందని అన్నారు.
ఐటీ శాఖ పరిధిలో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన పురోగతిని ఈ నివేదికలో ఉంచినట్లు తెలిపారు.జాతీయ సగటు 8.09 శాతం తో పోల్చితే 17.9 7 శాతం తో తెలంగాణ ఐటి మరియు ఐటీ సంబంధిత ఎగుమతులు ఉన్నాయన్నారు. దీంతోపాటు 2019- 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఐటీ రంగంలో పలు భారీ పెట్టుబడుల వచ్చాయన్నారు. అమెజాన్ తన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాంగణాన్ని, మైక్రాన్ తన అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించినట్టు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ తరఫున ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటిని తీసుకెళ్లాలన్న ప్రయత్నం విజయవంతం అయిందని టెక్ మహీంద్రా, సైయంట్ కంపెనీలు తర కేంద్రాలను వరంగల్ లో ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చారన్నారు.కరోనా సంక్షోభంలో ఐటీ శాఖ అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. రోగుల సంబంధిత కాంటాక్ట్ ట్రేసింగ్, వారి కదలికలు, హోమ్ క్వారంటైన్, వాలంటీరింగ్ వంటి అంశాల్లో ఐటీ శాఖ తన మద్దతును ఇతర డిపార్ట్మెంట్లకు అందించింది. ప్రస్తుత సంక్షోభం సందర్భంగా పలు డిజిటల్ సొల్యూషన్లు అందించేందుకు భాగస్వామిగా నిలిచింది.
•గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 10.61 నుంచి 11.58 కి పెరిగింది.
•జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ఎంప్లాయిమెంట్ 7.2% గా నమోదయింది. ఇదే సమయంలో జాతీయ సగటు 4.93 శాతంగా ఉన్నది.
•ఐటీ శాఖ విభాగమైన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ టీఎస్ టిఎస్ యెక్క మీసేవ ద్వారా సుమారు వందకు పైగా భాగస్వామి ఏజెన్సీల ద్వారా ఆరువందలకు పైగా సేవలను అందించడం జరుగుతుంది. మీసేవ ద్వారా కనీసం లక్షకుపైగా మంది పౌరులకు రోజువారీగా సేవలు అందిస్తున్నారు. టి యాప్ ఫోలియో 7 లక్షలకు పైగా డౌన్లోడ్ లను నమోదు చేసింది. టి యాప్ ఫోలియో ద్వారా 225 సేవలను 32 శాఖల భాగస్వామ్యంతో అందిస్తుంది. తన ఈ ప్రొక్యూర్మెంట్ వింగ్ ద్వారా సుమారు 1,55,182 టెండర్లను ప్రాసెస్ చేసింది. వీటి విలువ సుమారు లక్ష ఇరవై వేల 434 కోట్ల రూపాయలు. ఈ గణాంకాలతో భారత దేశంలోనే రెండవ అ ఆ స్థానాన్ని సాధించింది. టెక్నాలజీ ఎంపవరింగ్ గర్ల్స్ పేరుతో 560 మంది స్త్రీలకు డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను అందించింది.
•ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం ద్వారా వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా 2020 వ సంవత్సరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించి ఇప్పటివరకు ఎనిమిది అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సైబర్ సెక్యూరిటీ కోసం సైబర్ సెక్యూరిటీకి సంబందించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ని ప్రారంభించింది. డీజేఐ కంపెనీతో ఒక ఎంఓయూ కుదుర్చుకుని తెలంగాణలో డ్రోన్ పైలెట్ల శిక్షణకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
•టీవీవర్స్క్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్న కరోణ పరిస్థితుల నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఒక చవకైన మెకానికల్ వెంటిలేటర్ను తయారుచేసింది. టీ వర్క్స్ ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెల్ ఏర్పాటు చేసి స్టార్ట్ అప్ లు మరియు చిన్న తరహా యంయస్ యంఈలకు సహాయ సేవలను అందిస్తున్నది.
•టీ శాట్ ద్వారా 4612 ఎపిసోడ్ లను వివిధ ప్రోగ్రాం లో భాగంగా టెలికాస్ట్ చేసింది. ఇప్పటివరకు టీ షాట్ కి సంబంధించి మూడు లక్షల ఎనభై ఆరు వేల సబ్స్క్రైబర్లు యూట్యూబ్లో సంపాదించింది. యూట్యూబ్ లో అందించిన కార్యక్రమాలను 5 కోట్ల 30 లక్షల వ్యూస్ వచ్చాయి. మొత్తం యూట్యూబ్ లో టి శాట్ విడియోలను చూసిన నిమిషాల సంఖ్య ఒక కోటి 31 లక్షలు
•తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం తరపున తెలుగు వికీపీడియా కోసం ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తో కలిసి పని చేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న లక్ష వ్యాసాలను 30 లక్షలకు పెంచాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు
•తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తరఫున తెలంగాణ ఇన్నోవేషన్ యాత్ర చేపట్టడం జరిగింది. తద్వారా 120 మంది ఔత్సాహిక ఇన్నోవేటర్ల ను గుర్తించడం జరిగింది. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ యెక్క విలేజ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో సుమారు 400 మంది పాల్గొన్నారు
•తెలంగాణ ప్రభుత్వ అధికారిక డిజిటల్ వాలెట్ ద్వారా 11 లక్షల కు పైగా ఆక్టివ్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉన్నాయి. తద్వారా 6795 కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ లను నిర్వహించడం జరిగింది
•టి హాబ్ ఇప్పటికే నాలుగు సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసుకోంది. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నది. టి ఏంజెల్ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు రెండవ బ్యాచ్ 23 ల్యాబ్ ఇన్నోవేషణ్ ప్రోగ్రాం ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఫేస్బుక్, యూటిసి, బోయింగ్ వంటి అనేక కంపెనీలతో కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రాంలను కొనసాగిస్తున్నది
•తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ప్రారంభించిన నాటి నుంచి సుమారు మూడు లక్షల 50 వేల మంది యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు 1500 మంది ఫ్యాకల్టికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటిదాకా 40కిపైగా కార్పొరేట్ కంపెనీలతో పని చేస్తూ వస్తున్నది. ఇప్పటిదాకా సుమారు 4,500 మంది విద్యార్థులకు డైరెక్ట్ ప్లేస్మెంట్లు ఇవ్వడం జరిగింది
•ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ వింగ్ తరఫున వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ వాటా జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులో 6 శాతం గా ఉన్నది. సుమారు 250కి పైగా కంపెనీలు తెలంగాణలో ఒక లక్ష 16 వేల మందికి నేరుగా ఉపాధిని కల్పిస్తున్నాయి. 2019లో తెలంగాణ ఎలక్ట్రానిక్స్ విభాగం 7337 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకువచ్చింది. స్కైవర్త్ గ్రూప్ మరియు ఇన్నోలియా ఎనర్జీ వంటి భారీ పెట్టుబడులతో పాటు ప్రస్తుతం ఉన్న కంపెనీలు కూడా విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయి. మైక్రాన్ తన ఉద్యోగులను 700 నుంచి 2000 పెంచింది. వన్ ప్లస్ ప్రతిపాదించిన వెయ్యి కోట్ల పెట్టుబడితో వన్ ప్లస్ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నది
•దేశంలోనే మొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విహాబ్ అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రీమియర్ ఇంక్యూబేషణ్ ప్రోగ్రామ్కి 223 అప్లికేషన్లు వచ్చాయి. రెండవ మరియు మూడవ తరగతి పట్టణాల్లోని మహిళలకు సహాయం చేసేందుకు వి హబ్ చేపట్టిన ప్రాజెక్ట్ హార్ అండ్ నౌ ప్రోగ్రాం ప్రారంభమైంది.
•దీంతో పాటు గత సంవత్సరం జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో ప్రపంచ స్థాయి కంపెనీల యొక్క సీనియర్ మేనేజ్మెంట్ పత్రినిధులతో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని ఐటి శాఖా బృందం సమావేశమైంది. తద్వారా తెలంగాణలోకి రానున్న అనేక పెట్టుబడులకు సంబంధించి ప్రాథమిక స్థాయి చర్చలను పూర్తి చేసుకుంది