దేశానికే ఆదర్శంగా చింతమడక: సీఎం కేసీఆర్

351
harishrao
- Advertisement -

సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామం దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు.త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని… త్వరలోనే పాడి పశువులను పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రామ లబ్ధిదారులకు రూ.9 కోట్ల 87 వేల చెక్కుల పంపిణీ చేసిన హరీష్‌ …సీఎం సారూ పేరు, గ్రామ పేరు నిలబెట్టాలన్నారు.

చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలు దేశానికి ఆదర్శంగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కల అన్నారు .సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామంలో శనివారం రూ.22 లక్షల రూపాయలతో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్ రావు..ఈ మేరకు చింతమడక గ్రామనికి సీఎం కేసీఆర్ వచ్చి ఇచ్చిన హామీ మేరకు 1270 మందికి సాయం అందిందినని, భూ స్థలాలు కొనుగోలుకై 133 మందికి రూ.9 కోట్ల 87 వేల రూపాయల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు..చింతమడక ముద్దు బిడ్డ అయిన సీఎం కేసీఆర్ గ్రామనికి వచ్చి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 1270 మందికి సాయం అందించడం జరిగిందన్నారు.

గ్రామాలను అభివృద్ధి చేసే క్రమంలో సీఎం హామీ మేరకు మూడు గ్రామాలు కలుపుకుని1580 యూనిట్లు ఉండగా, ఇవాళ చింతమడకలో 133 మందితో కలిపి 1270 మందికి లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వెల్లడించారు.గ్రామాల్లో ఇళ్లు తొలగించని వారు కూడా ఇళ్లు తొలగించి స్థలాలను ఇస్తే.. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

భూ స్థలాలు కొనుగోలు చేసేందుకుగాను 133 మందికి రూ.9 కోట్ల 87 వేల రూపాయల విలువ కలిగిన చెక్కులను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. భూమి కొంటే పది కాలాలు మీకే ఉంటుందని, ఎవరూ భూములు అమ్ముకోవద్దని గ్రామస్తులను కోరారు.కాళేశ్వరం నీళ్లు వచ్చిన సందర్భంగా లబ్ధిదారులు భూములు కొనుక్కోవడం ఎంతో ప్రయోజనకరమని నీళ్లతో ప్రతి రైతుకు యేటా రెండు పంటలు పండించుకునే వీలుందని,ప్రతీ రైతు సంతోషంగా గడపడాలని కోరారు.

త్వరలోనే పాడి పశువులను పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.చింతమడక, మధిర గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు..ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో కూలీలు సరిగ్గా అందుబాటులో లేక పోవడంతో ఆలస్యం జరిగిందని, పనులు త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.

మరో వారం రోజులలోపు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం ప్రతీ ఎకరాకు 5 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు.త్వరలో గ్రామంలో శివాలయం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.సీఎం సూచనలను స్వీకరించి రైతులు నియంత్రిత సాగుకు ముందుకు వచ్చి పంటల సాగులో మార్పులు తెచ్చారని రైతులను అభినందించారు. ప్రతి గ్రామంలో రైతులు 60 శాతం సన్న రకం వరి సాగు చేయాలని మంత్రి కోరారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి కామెంట్స్…చింతమడక గ్రామం వ్యవసాయ పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడమే సీఎం కేసీఆర్ కల అన్నారు.

ఇప్పటికే గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు సగం వరకు పూర్తి అయ్యేవని కరోనా నేపథ్యంలో ఆలస్యమైందని తెలిపారు. గ్రామ లబ్ధిదారులు ఎక్కువ భూములు కొనుగోలు చేస్తున్న క్రమంలో రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉచితంగా చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లాలో ఎక్కువగా రిజర్వాయర్లు ఉన్న క్రమంలో గ్రామాల్లో ప్రతీ ఎకరానికి సాగునీరు అందే అవకాశం ఉన్నదని, దీంతో సిద్దిపేట జిల్లా వ్యవసాయ జిల్లాగా మారనున్నదని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి, కలెక్టర్ చింతమడక, అంకంపేట, దమ్మ చెరువు గ్రామ పునర్నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో
కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరును మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా అంకంపేట, దమ్మచెరువు గ్రామస్తులతో కాసేపు మంత్రి ముచ్చటించారు. మరో మూడు నెలల్లో మిమ్మల్ని కొత్త ఇండ్లకు తోలుతామని, గ్రామస్తులకు వివరిస్తూ.. వారం, 10 రోజుల్లో చింతమడక, దమ్మ చెరువు, అంకంపేట గ్రామాల చెరువులు నిండనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -