27న ఇంటర్ రీవెరిఫికేషన్‌ రిజల్ట్స్‌:హైకోర్టు

170
telangan hc

ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్‌ ఫలితాల పిటిషన్‌పై ఇవాళ విచారించిన హైకోర్టు ఫలితాల ప్రకటనతో పాటు సమాధానపత్రాల అప్‌లోడ్ ఒకేసారి చేయాలని స్పష్టం చేసింది. దీంతో పాటు గ్లోబరీనా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఫెయిలైన విద్యార్థుల రీవేరిఫికేషన్, రీకౌంటింగ్ పూర్తి చేశామని కోర్టుకు తెలిపింది ఇంటర్ బోర్డు. 16న ఫలితాలను ప్రకటిస్తామని..సమాధానపత్రాలను మే 27న వెబ్‌సైట్‌లో పెడతామని ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఫలితాల ప్రకటన, సమాధానపత్రాల అప్‌లోడ్ ఒకేసారి చేయాలని పేర్కొంటూ స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.