కాళేశ్వరం..మూడో మోటర్ వెట్ రన్ సక్సెస్

261
kaleshwaram
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో వెట్ రన్ విజయవంతమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం భూగర్భంలో నిర్మించిన మూడో పంపు వెట్ రన్‌ను నీటి పారుదల శాఖ అధికారులు ప్రారంభించారు.

వెట్ రన్ సక్సెస్‌తో అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. మూడో వెట్ రన్ విజయవంతం కావడంతో సాయంత్రం నాలుగో మోటర్ వెట్ రన్‌ను అధికారులు ప్రారంభించనున్నారు.

గత నెల 24, 25వ తేదీల్లో మొదటి, రెండో మోటర్లు వెట్ రన్ నిర్వహించిన అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లింకు-2లో భాగంగా నంది మేడా రం వద్ద అండర్ టన్నెల్‌లో భారీ పంపు హౌస్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక్కడికి వచ్చిన నీటిని పక్కనే ఉపరితలంలో ఉన్న మేడారం రిజర్వాయర్‌లో ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌లో ఏడు భారీమోటర్లు ఏర్పాటు చేశారు.

- Advertisement -