ఈనెల 18న కంటి వెలుగు….

62
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ఈ నెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్రవైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. జిల్లా అధికారులు కంటి వెలుగు కార్యక్రామన్నికి అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేశ్‌ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస రావు, టీఎస్ఎంఎంస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ కంటి వెలుగును ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాలో కంటి పరీక్షలు ప్రారంభించాలన్నారు. శుక్రవారం సాయంత్రంకల్లా అన్ని పరీక్ష కిట్లు ఆయా జిల్లా కేంద్రాల నుంచి పీహెచ్‌సీలకు చేరాలని ఆదేశించారు. వాట్సప్ గ్రూపుల ద్వారా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతికి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. బృందాలు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఒకసారి వాట్సప్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామాల్లో పట్టణాల్లో ఫ్లెక్సీలు బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహణ ఉంటున్నందున సాంకేతిక సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో విడతల వారీగా 16,533 లొకేషన్స్ (రూరల్ -12,763, అర్బన్ -3,788)లో క్యాంపులు నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 30లక్షల రీడింగ్ గ్లాస్, 25 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ అవసరమైన వారికి ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఇవి కూడా చదవండి…

పథకాలు కేసీఆర్‌వి…పన్నులు మోడీవి

సుపరిపాలన ధ్యేయంగా పని చేస్తున్నాం..

ఏపీ సీఎం జగన్‌తో సోమేశ్ కుమార్ భేటీ..

- Advertisement -