ప్రజల ఆలోచన సరళి మారాలి..

49
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావమే దేశాన్ని రక్షించుకనేందుకు….ఇందుకు వేదికగా ఖమ్మం జిల్లా నుంచి సమరశంఖం పూరిస్తున్నట్టు సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో అవినితి ప్రజల ఆలోచన సరళి మారాలని అందుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ నిర్మాణం ఉంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సభావేదికగా కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో మంచినీళ్లు రావు కరెంటు ఉండదు. అటువంటి పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. కానీ ఉపన్యాసాలు వింటే టీవీలు బద్ధలై పోతాయని ఎద్ధేవా చేశారు. రైతులు విద్యార్థులు యువకులు విద్యావేత్తలు ఆలోచించాలి మార్పు మన నుంచి ఎందుకు మొదలు కాకుడదని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటివరకు 2.10లక్షల మెగావాట్లకు మించి విద్యుత్‌ వాడలేదు అని అన్నారు.

తెలంగాణలో తప్పా భారతదేశంలో ఏయే రాష్ట్రంలో, ప్రధాని సొంత రాష్ట్రం సహా 24 గంటల కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఎన్నికల్లో గెలవాలి తప్ప నాయకులు కాదు అని అన్నారు. దేశంలో ఆలోచన సరళి మారాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల తదనంతరం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం తప్పకుండా నెరవేర్చాలి. లేకపోతే నిలబెట్టి నిలదీసే పరిపూర్ణమైన ప్రజాస్వామ్య ప్రక్రియ రానంత వరకు ఈ దేశంలో ఇవే ఉపన్యాసాలు, సొల్లు పురాణాలు, కాలక్షేపాలు చూస్తాం తప్ప న్యాయం జరుగదు. దేశాన్ని రక్షించుకునేందుకు అందరూ నడుం కట్టాలి. మేం బాగున్నం కాదా..? పొరుగింటోళ్లు ఏమైతే ఏంటీ అనుకుంటే.. ఒక రోజు మనకు ఇబ్బంది వస్తుంది. ఖమ్మంలో జరిగే సభలో దేశం నుంచి ముఖ్యమంత్రులు పెద్దలు రాబోతున్నారు. ప్రజలంతా వచ్చి పాల్గొనాలి తెలంగాణ ఏవిధంగా ముందుకుపోతుందో దేశం కూడా ఆదేవిధంగా ముందుకు పోవాలన్నారు.

ఇవి కూడా చదవండి…

సుపరిపాలన ధ్యేయంగా పని చేస్తున్నాం..

పథకాలు కేసీఆర్‌వి…పన్నులు మోడీవి

ఈనెల 18న కంటి వెలుగు….

- Advertisement -