దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతం- కేటీఆర్‌

79
- Advertisement -

చేనేత రంగంలో విశిష్ట సేవలందించిన జాతీయ అవార్డు గ్రహీతలు కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్ మరియు మెరిట్ సర్టిఫికెట్ విజేతలు సాయిని భరత్, దుద్యాల శంకర్, తడక రమేష్‌లను మంత్రి కేటీఆర్ సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిన అవార్డు గ్రహితలకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ రాష్ట్రం సొంతమని వారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చేనేత పథకాల వలన చేనేత రంగం అభివృద్ధి చెందుతుందని, చేనేత కళాకారుల సంక్షేమం కొరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్.రమణ, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి కర్నాటి విద్యాసాగర్, జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త యర్రమాద వెంకన్న నేత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -