మా ఎన్నికలు: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ సంచలన నిర్ణయం..

34

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అక్టోబరు 10న మా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీనియర్ నటి జీవితా రాశేఖర్‌ ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జీవిత అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు.

ఇటీవల ఒక పార్టీలో జూ.ఎన్టీఆర్‌గారిని కలిశాను. ‘మీరు నాకు ఓటు వేయాలి’ అని ఆయనను అడిగా. ‘నన్ను అడగొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది’ అని అన్నారు. ఆయన చెప్పినట్లు నిజంగా పరిస్థితి అలాగే ఉంది’’ అని జీవితా రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది.