కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ..

61

కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని లేఖలో సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు. తెలంగాణలో మరో మూడు రోజులకు మాత్రమే కరోనా టీకా డోసులు మిగిలి ఉన్నాయి. 5.66 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే తెలంగాణలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. రోజుకు 1.15 లక్షల దోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రోజుకు 2 లక్షల డోసులు పంపిణీ చేయాల్సివుంది. అయితే వచ్చే 15 రోజులకు సరిపడా కనీసం 30 లక్షల డోసులు వెంటనే పంపిణీ చేయాలని లేఖలో సీఎస్ సోమేష్ కుమార్ కోరారు.