రాష్ట్రంలో కొత్తగా 3,187 క‌రోనా కేసులు నమోదు..

137
Covid-19

తెలంగాణలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో 3,187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 787 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,05,335 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,759గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 20,184 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 13,366 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 551 మందికి క‌రోనా సోకింది.