తెలంగాణలో కొత్త కొలువుల నోటిఫికేషన్

68
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2391పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోలీస్‌, గ్రూప్1,2,3,4 ,ఆరోగ్య శాఖలో భర్తీకి అనుమతి లభించాయి. తాజాగా ఈ ఖాళీలను టీఎస్పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో అత్యధికంగా బీసీ గురుకులాల్లో భర్తీ చేయనున్నారు.

ఇందులో 1499పోస్టులను…ప్రిన్సిపల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324, లైబ్రేరియన్ 11, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్‌37, లైబ్రేరియన్ ఇన్ స్కూల్‌ 11, ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజ్ 20, పిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇన్ స్కూల్‌ 33, ఆర్ట్/ క్రాప్ట్/ మ్యూజిక్ 33, అసిస్టెంట్‌ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజ్‌15, ల్యాబ్ అసిస్టెంట్ 60, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 30, స్టోర్ కీపర్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టులు…అసిస్టెంట్ ఇన్ఫర్మెషన్ ఇంజినీర్ 41, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 16, ఎడిటర్ (ఉర్దూ) 01, ఇన్ఫర్మెషన్ టెక్నిషియన్ 22, పబ్లిక్‌ రిలేషన్ ఆఫీసర్‌ 04, పబ్లిసిటీ అసిస్టెంట్‌ 82 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఇవి కూడా చదవండి…

టీబీజీకేఎస్ ఆవిర్భావ శుభాకాంక్షలు:కవిత

వైరల్‌…మద్యం కేసులో చిలుక విచారణ

విస్తరిస్తోన్న బి‌ఆర్‌ఎస్.. ఆ పార్టీలకు ముప్పే!

- Advertisement -