యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

279
Tamilisai at Yadadri

నేటి నుంచి తెలంగాణలో పర్యటించనున్నారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, యాదాద్రి ఈవో, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు తమిళిసై దంపతులకు ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు తమిళిసై దంపతులు ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

యాదాద్రిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునర్నిర్మాణ పనులను గవర్నర్ కు వివరించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారిగా ఆమె యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు.

అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ..కుటుంబసమేతంగా స్వామివారి ని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలని ఆస్వామివారిని కొరుకున్నానని గవర్నర్ తమిలి సై సౌoదర్ రాజన్ అన్నారు.

మరికాసేపట్లో ఆమె వరంగల్ లోని కాకతీయుల కోటలోని చారిత్రక కట్టడాలను పరిశీలించనున్నారు. అనంతరం టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌండ్‌ అండ్‌ లైట్స్‌ షోను తిలకించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌కు వెళ్లి, అనంతరం సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సెంటర్‌లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వేయిస్తంభాల ఆలయం, భద్రకాళీ అమ్మవారి ఆలయాలను గవర్నర్‌ సందర్శిస్తారు. రాత్రి వరంగల్‌లోనే బసచేస్తారు.