భారత ఆవిష్కరణ సూచీల్లో .. తెలంగాణ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నదని నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ బేరీ తెలిపారు. సుమన్ బేరీ ఇవాళ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను రిలీజ్ చేశారు. సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్లోబల్ ఇన్నోవేషణ్ ఇండెక్స్ ఆధారంగా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌ను తీర్చిదిద్దారు. మూడవ సారి నీతి ఆయోగ్ ఈ సూచీలను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో కర్నాటక, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలను గెలుచుకున్నాయి. జాతీయ స్థాయిలో ఆవిష్కరణలకు కావాల్సిన సామర్థ్యం, వాతావరణం ఎలా ఉందో గమనించి ఈ ర్యాంకులను ప్రజెంట్ చేస్తారు.
వరుసగా మూడవ సారి కర్నాటక టాప్ ప్లేస్‌ను కొట్టేసింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ) సూత్రాలకు అనుగుణంగా జాతీయ స్థాయి ఆవిష్కరణ సూచీలను రూపొందించారు. దీని కోసం 66 విశిష్టమైన ఇండికేటర్స్‌ను ప్రవేశపెట్టారు. పెద్ద రాష్ట్రాల క్యాటగిరీలో కర్నాటక టాప్ రాగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల క్యాటగిరీలో మణిపూర్, కేంద్ర పాలిత ప్రాంతాల క్యాటగిరీలో చండీఘడ్ ఫస్ట్ వచ్చాయి.