28 నుండి రైతు బంధు…

137
rythu bandhu

యాసంగికి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తొలుత ఈ నెల 27 నుండి రైతు బంధు పంపిణీ చేయాలని భావించిన ఆదివారం కావడంతో ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది.

గతేడాది 57.62 లక్షల మందికి యాసంగి సాయం అందించగా ఈ సారి కొత్తగా 1.70 లక్షల రైతులను కలిపి మొత్తం 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు.

బ్యాంకుల నుంచి రైతులు నగదు డ్రా చేసే సమయంలో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పర్యవేక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించారు.