రజనీకాంత్ హెల్త్ అప్‌డేట్!

50
rajini

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. శుక్రవారం అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన రజనీ ప్రస్తుతం కొలుకుంటున్నారు. ర‌క్త‌పోటులో హెచ్చుత‌గ్గుల వ‌ల్ల ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు వెల్లడించారు.

మరో రెండు రోజుల పాటు రజనీకి ఆస్పత్రిలోనే చికిత్స అందించనున్నామని అభిమానులు ఆందోళ‌న చెంద‌నవ‌స‌రం లేద‌ని తెలిపారు. మరో ఐదు రోజుల్లో రజనీ పార్టీ విధివిధానాలు ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిపాలు కావడం చర్చనీయాంశంగా మారింది.

త‌లైవా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరార‌ని తెలుసుకున్న అభిమానులు చెన్నై నుండి హైద‌రాబాద్‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు రజనీ ఆరోగ్య పరిస్ధితిపై ఆయన కూతురిని అడిగి తెలుసుకున్నారు.