తగ్గిన మద్యం ధరలు..ఎంతంటే..!

85
- Advertisement -
తెలంగాణలో భారీగా మద్యం ధరలు తగ్గిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఫుల్ బాటిల్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్‌పై రూ.10 చొప్పున తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.  వివిధ రకాల బ్రాండ్‌ల ఫుల్‌ బాటిల్స్‌పై రూ.60వరకు తగ్గించినట్టు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు.
రాష్ట్రంలో అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా తరలిస్తున్నట్టు అధికారులు తేల్చారు. దీంతో అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వివరించారు.
- Advertisement -