రాబోయే 3రోజుల్లో…చలి పులి

144
- Advertisement -

చలికాలం అనగానే గుర్తుకు వచ్చేది… తెల్లవారు జామున మంటలు వేసుకోవడం. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకునుగుణంగా ప్రజలు ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మారుతున్న కాలుష్య వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణంలో మార్పుల వల్ల ఈ సంవత్సరం చలి విపరీతంగా పెరుగుతోందని అంచనా. సాయంత్రం 6 అయిందంటే చాలు చ‌లి తీవ్ర‌త పెరిగిపోతోంది.

అయితే రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చ‌లి తీవ్ర‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాబోయే మూడు రోజుల్లో 10 డిగ్రీల సెల్సియ‌స్ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో వృద్ధులు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, వెచ్చ‌ని దుస్తులు ధ‌రించాల‌ని సూచించింది.

ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, మెద‌క్, నిర్మ‌ల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల‌కు వాతావ‌ర‌ణ విభాగం ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. గురువారం రోజు చ‌లి తీవ్ర‌త అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

ఇవి కూడా చదవండి..

ఆరోగ్య తెలంగాణకు మరో ముందడుగు:హరీశ్‌

- Advertisement -