ఇవాళ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ హోటల్ ఎల్లాలో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి ఎంపిక జరనుండగా రేవంత్ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియంకలు హాజరయ్యే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి పదవికోసం గ్రూపులు కట్టకుండా వ్యూహం సిద్ధం చేశారు. వీలైనంత త్వరగా రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. టైం గడిస్తే చిక్కులు తప్పవనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టకుండా ఇవాళ రాత్రి హోటల్ లోనే బస ఏర్పాటు చేశారు.
ఇక ఇప్పటికే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళ్ సై తో సమావేశం అయ్యారు కాంగ్రెస్ నేతలు. టీపీసీసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే,కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిశారు.
Also Read:సీఎంగా రేవంత్..డిప్యూటీగా భట్టి