టీ కాంగ్రెస్‌కు కన్నడ లీడర్ల భయం!

30
- Advertisement -

టీ కాంగ్రెస్ ను ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలముందు అసంతృప్త వాదుల నుంచి దిక్కర స్వరం వినిపిస్తుంటే.. మరోవైపు పార్టీ వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవి చాలదన్నట్లు ఇప్పుడు మరో కొత్త సమస్య కాంగ్రెస్ ను చుట్టుముట్టింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత తెలంగాణలో ఆ పార్టీలో జోష్ పెరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు తెలంగాణలో పూర్తిగా డీలా పడ్డ హస్తం పార్టీకి కర్నాటక ఫలితాలు ఊపిరినిచ్చాయి. అయితే ఆ కర్నాటక రాజకీయాలే ఇప్పుడు టీ కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తరువాత సి‌ఎం పదవి విషయంలో తీవ్ర అసంబద్దత నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డికె శివకుమార్, సిద్దిరామయ్య మద్య సి‌ఎం పదవిపై విభేదాలు గుప్పుమన్నాయి..

దాంతో అధిష్టానం కలుగజేసుకొని చెరో రెండున్నర సంవత్సరాలు సి‌ఎం పదవిలో ఉండేలా డీల్ కుదిర్చారు పార్టీ పెద్దలు. అయితే తాజాగా సి‌ఎం పదవి విషయంలో సిద్దిరామయ్య చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఐదేళ్లు తానే సి‌ఎంగా ఉంటానని ఇందులో ఎలాంటి సందేహం లేదని సిద్దిరామయ్య చెప్పుకొచ్చారు. దీంతో డీకే ఎలా వ్యవహరిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. సి‌ఎం పదవి విషయంలో వెనక్కి తగ్గబోనని, పార్టీలో చీలిక తెచ్చేందుకు కూడా తాను సిద్దమే అని డీకే శివకుమార్ గతంలోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ముందు కన్నడ రాజకీయాలు హాట్ హాట్ గా మారితే.. ఆ ప్రభావం టీ కాంగ్రెస్ పై పడుతుందనే భయం పార్టీ నేతల్లో ఉందట. మొత్తానికి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డాట్లైంది కాంగ్రెస్ పరిస్థితి.

Also Read:TTD:అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

- Advertisement -