అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్..రిలీజ్

47
- Advertisement -

ఇవాళ శాసన సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నేటి నుండి నామినేషన్లను స్వీకరించనుండగా ఆదివారం మినహా ప్రతిరోజు  ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. నామినేషన్ స్వీకరణకు చివరి గడువు నవంబర్ 10 కాగా ఈనెల 13న నామినేషన్ల స్కృటీని ఉండనుంది. ఈనెల 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ చివరి గడువు.

30న పోలింగ్ జరగనుండగా వచ్చే నెల 3న కౌంటింగ్ జరగనుంది. జనరల్,బిసి అభ్యర్థుల డిపాజిట్ 10 వేలు,ఎస్సి,ఎస్టీ అభ్యర్థులు 5 వేల డిపాజిట్. ఆర్వో కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నామినేషన్ వేసే వ్యక్తి తోపాటు మరో ఐదుగురికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు.

ఆర్వో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరా లు ఏర్పాటు,ర్యాలీలు,సభలు నిషేదించారు.ఆర్వో కార్యాలయం కు 100 మీటర్ల వరకు అభ్యర్థి 3 వాహనాలకు మాత్రమే అనుమతించనున్నారు.అభ్యర్థి నామినేషన్ వేసే ఒక్క రోజు ముందు రాష్ట్రంలోని ఏదైనా బ్యాంక్ లో ఎన్నికల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఓపెన్ చెయాలన్నారు. ఓపెన్ చేసిన బ్యాంక్ ఖాతా ను నామినేషన్ తోపాటు ఆర్వో కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.ఎన్నికల కోసం ప్రతి ఖర్చు ఈ ఖాతా నుండే చేయాలి. ఇవాళ్టి నుండే అభ్యర్థి ఖర్చు ను లెక్క కట్టనున్నారు వ్యయ పరిశీలిలకులు.

Also Read:నట్టి కుమార్ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్

- Advertisement -