క్రిస్మస్ విందుకు హాజరుకానున్న సీఎం…

45
- Advertisement -

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేపు జరగబోయే క్రిస్మస్ విందు ఏర్పాట్ల పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పర్యవేక్షించారు. మంత్రులతో పాటు హైదరాబాద్ ఎమ్మెల్యేలు, నగర మేయర్ విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా వెంట ఉన్నారు. వీరి వెంట ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్‌ వేడుకలకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ అన్ని మతాల ప్రజలతో మమేకమవుతున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేపు జరిగే క్రిస్మస్‌ విందు వేడుకలు సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతాయని…6గంటలకు సీఎం కేసీఆర్ చేరుకొని ప్రార్థనల అనంతరం విందులో పాల్గొంటారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో 12వేల మంది పాల్గొంటారని దానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి…

మీ ఆశీస్సులే సీఎంకు శ్రీరామరక్ష…

చంద్రబాబుతో హీరో విశాల్ ఢీ.. నిజమేనా ?

ఏపీలో లంచాల గోల.. ఎంటిది!

- Advertisement -