ఏపీలో లంచాల గోల.. ఎంటిది!

31
chandrababu
- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరెప్షన్ పాలిటిక్స్ అంటూ కొత్త చర్చ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలత్తో నిర్వహించిన సమీక్షలో నేతలంతా కరెప్షన్ కు దూరంగా ఉండాలని, ఎన్నికలు మరో ఏడాదిన్నర జరగనున్నాయని, అందువల్ల ఎమ్మేల్యేలు అలాగే పార్టీ నేతలు ప్రతిఒక్కరు ఎంతో జాగ్రతగా నడుచుకోవాలని జగన్ సూచించారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన మరియు టీడీపీ వ్యంగ్యస్త్రాలు గట్టిగానే సంధించాయి.

వైసీపీ ప్రభుత్వం ఏపీలో కరెప్షన్ హాలిడే ప్రకటించిందని పవన్ ఆ మద్య చేసిన ట్విట్లు గట్టిగానే వైరల్ అయ్యాయి. అటు టీడీపీ కూడా కరెప్షన్ పాలిటిక్స్ అంటూ గట్టిగానే విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఇటీవల సత్తెనపల్లి ఎమ్మెల్యే మరియు ఇరిగేషన్ మంత్రి అయిన అంబటి రాంబాబు పై ఈ కరెప్షన్ విమర్శలు గట్టిగానే వినిపించాయి. ముఖ్యంగా పవన్ సత్తెనపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో కరెప్టెడ్ మంత్రి అంటూ అంబటి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే పవన్ వ్యాఖ్యలపై అంబటి కూడా గట్టిగానే ఫైర్ అయ్యారు.

తాను లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే శాసన సభ్యత్వానికి అలాగే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు. అయితే సత్తెనపల్లి మున్సిపల్ పరిధిలోని ఓ కుటుంబం ఆధారమైన కుమారుడు చనిపోతే ప్రభుత్వం 5 లక్షలు సాయం చేసింది. ఈ 5 లక్షలలో 2.50 లక్షలు మున్సిపల్ చైర్మెన్ లంచం అడిగాడని, ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే అయిన అంబటి రాంబాబు ను కలిస్తే ఆయన కూడా 2.50 లక్షలు ఇవ్వాల్సిందే అన్నారని ఆ కుటుంబం వాపోయింది. ఇందుకు సంబందించి వార్తలు వీడియో క్లిప్స్ కూడా వైరల్ అయ్యాయి. కానీ అంబటి మాత్రం తాను ఎలాంటి లంచం అడగలేదని చెబుతున్నారు. ఇలా మొత్తానికి ఏపీలో జరుగుతున్నా లంచల గోల హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతుంది.

ఇవి కూడా చదవండి…

పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారు… నేను కాదు

హైదరాబాద్‌కు పంజాబ్ సీఎం..

జవాన్లపై నోరు జాగ్రత్త:ఎస్‌జైశంకర్‌

- Advertisement -