సచివాలయంను పరిశీలించిన సీఎం…

54
- Advertisement -

చివరి దశకు చేరుకున్న సచివాలయం పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. మంత్రి వేముల ప్రశాంత్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు, ప్రాజెక్టు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇంజినీర్లకు వర్క్‌ ఏజెన్సీలకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. సచివాలయంలోని అన్ని గదులను కలియ తిరిగి చూశారు.

సిగ్న‌ల్ బూస్టింగ్ సిస్ట‌మ్‌, ఫైర్ ఫైటింగ్ సిస్ట‌మ్‌ను ప‌రిశీలించారు. ప్రీమియం మార్బుల్, స్టోనింగ్, వుడ్ వ‌ర్కుల‌ను ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు సీఎం. గ్రానైట్, మార్బుల్ ఫ్లోరింగ్, లిఫ్టుల ప‌నుల తీరును కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేస్తున్న వ‌స‌తుల‌ను సీఎం ప‌రిశీలించారు. పార్కింగ్ ఏరియాను కూడా కేసీఆర్ సంద‌ర్శించారు. స‌చివాల‌యం ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్ల‌ను ప‌రిశీలించారు. ల్యాండ్ స్కేప్, సివ‌రేజ్, రెడ్ సాండ్ స్టోన్, ఫైర్, ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్క్, ఫ్లోర్ ప‌నుల‌పై ఇంజినీర్లు, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ప‌లు సూచ‌న‌లు చేశారు.

నూతనంగా నిర్మించనున్న సచివాలయంను ఫిబ్రవరి 17న ఉదయం 11.30 నుంచి 12.30గంటలకు మధ్య సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. సచివాలయంకు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

ప్రగతి నివేదన సభలో కేటీఆర్‌ ఫైర్‌

సొంత గూటికి పొంగులేటి..?

బీజేపీకి షాక్..ఇలా అయితే కష్టమే!

- Advertisement -