క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌

50
- Advertisement -

టీమిండియా 2023లో తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌ క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లో 385పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ శుభ్‌మన్ గిల్‌ సెంచరీలు నమోదు చేశారు. వీరితో పాటుగా హార్దిక్‌ పాండ్య ఆర్థ శతకంతో రాణించడంతో భారత్ 385మార్క్‌ను దాటింది. కివీస్ బౌలర్లలో జాకబ్ టిక్నర్ చెరో మూడు వికెట్లు తీశారు. మైఖేల్ బ్రాస్వేల్ ఒక వికేట్‌ పడగొట్టాడు.

386 పరుగుల లక్ష్యంను చేధించే క్రమంలో కివీస్ ఘోరంగా విఫలం చెందింది. కివీస్ బ్యాటర్స్‌లో డ్వేన్‌ కాన్వే(138) శతకం నమోదు చేశారు. నికోలస్(42) మాత్రమే రాణించారు. శార్దూల్ ఠాకూర్ మిచెల్, లాథ‌మ్, గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను కోలుకోలేని దెబ్బ‌ తీశాడు. ఆ త‌ర్వాత కుల్దీప్ న నికోల‌స్, బ్రేస్‌వెల్, ఫెర్గూస‌న్ వికెట్లు తీసి కివీస్ ప‌త‌నాన్ని శాసించాడు. దాంతో ఆ జ‌ట్టు 295 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి…

షమీకి షాక్‌..!

డబుల్స్‌లో సానియా జోడి ఓటమి..

సచివాలయంను పరిశీలించిన సీఎం…

- Advertisement -