ఖమ్మం జిల్లాకు వరాల్లు:సీఎం

67
- Advertisement -

బీఆర్ఎస్‌ ఏర్పాటు ఆవిర్భావ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఖమ్మం ప్రజలకు వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 10వేల జనాభాకు మించి ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10కోట్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

మున్సిపాలిటీలకు మధిర, వైరా, సత్తుపల్లి కి తలా రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌కు ఆదేశాలు ఇస్తున్న అని ఈ సందర్భంగా ప్రకటించారు.

జిల్లాలోని జర్నలిస్ట్‌లకు ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్న రకాల వనరులు ఉన్నాయని…వాటిని ఉపయోగించుకోవడము చేతకావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ భవితవ్యం గురించి వివరించారు.

ఇవి కూడా చదవండి…

బీజేపీని గద్దే దించడమే మా లక్ష్యం…

మూడు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా…

రెండోవిడత కంటివెలుగు ప్రారంభం..

- Advertisement -