ఈ ఏడాది ప్రభాస్ నుండి రెండు?

68
- Advertisement -

అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో సంక్రాంతి స్పెషల్ గా ప్రభాస్ ‘ఆదిపురుష్’ రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో సినిమా జూన్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఏప్రిల్ లేదా మే వరకు పెండింగ్ వర్క్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ ఏడాది ఈ సినిమాతో పాటు ప్రభాస్ నుండి మరో సినిమా కూడా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే సలార్ కూడా ఈ ఏడాదే రిలీజ్ అనుకున్నారు కానీ ఆ సినిమా 2023 నుండి 2024 కి షిఫ్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తుంది.

ఇక ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. రాజా డీలక్స్ (వర్కింగ్ టైటిల్) అంటూ కామెడీ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. తన బిజీ షెడ్యూల్ నుండి ఈ సినిమా కోసం నెలకి ఐదు రోజులు చొప్పున డేట్స్ ఇస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. ఈ నెల చివర్లో మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

గతేడాది రాధే శ్యామ్ తో నిరాశ పరిచిన ప్రభాస్ ఈ ఇయర్ రెండు సినిమాలతో ఎంటర్టైన్ చేయడం పక్కా. మరి వీటిలో ప్రభాస్ కి సాలిడ్ హిట్ అందించే సినిమా ఏదో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పుష్ప ఎఫెక్ట్… తమిళ్ లో బిజీ!

ఫిబ్రవరి19..తెలుగు చలన చిత్ర మండలి ఎన్నికలు

రానా…ఆనందరావు అడ్వెంచర్స్ ఫస్ట్‌ లుక్‌

- Advertisement -