రాష్ట్రంలో కొత్తగా 176 మందికి కరోనా పాజిటివ్..

224
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మునుపటి తీవ్రత లేకపోయినా, పలు జిల్లాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 176 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 163 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,98,807 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,634 మంది మరణించారు. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ అధికమవుతుండడం పట్ల పొరుగునే ఉన్న తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మహారాష్ట్రలో నమోదువుతున్న కేసులకు కొత్త స్ట్రెయిన్ కారణమా లేక పాత రకం కరోనా వల్లే వ్యాప్తి జరుగుతోందా అనేది ఇంకా తెలియరాలేదు.

- Advertisement -