ప్రణబ్‌,రామలింగారెడ్డికి అసెంబ్లీ నివాళులు..

104
telangana assembly

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వారి సేవ‌ల‌ను స‌భ్యులు గుర్తు చేశారు.

కరోనా నేపథ్యంలో ఉభయ సభల నిర్వహణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారినే లోప‌లికి అనుమ‌తించారు. సభలో ఒక సీట్లో ఒకరే కూర్చొనేలా.. అదనంగా అసెంబ్లీలో 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు.

అసెంబ్లీకి వచ్చే ఫైల్స్‌ను శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక యంత్రాలను అమర్చారు. సందర్శకులను, ఎమ్మెల్యేల పీఏలను అనుమతించలేదు. మీడియాను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మంత్రుల పేషీ నుంచి ఒక పీఏ, ఒక పీఎస్‌నే మాత్ర‌మే అనుమ‌తించారు.