హరీష్ కోలుకోవాలని వేములవాడకు పాదయాత్ర..

151
harihrao

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్ రాగా వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని సిద్దిపేట నుండి వేములవాడ రాజన్న సన్నిధికి పాదయాత్ర నిర్వహించారు టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ఆకు బత్తిని రాము, కౌన్సిలర్ గుండెల్లి శ్రీనివాస్‌ గౌడ్. పాదయాత్ర వేములవాడకు చేరుకోగా రాజన్నను దర్శించుకున్న వారు తమ అభిమాన నేత త్వరగా కోలుకోవాలని మొక్కుకున్నట్లు తెలిపారు.