రూ. 100కే నల్లా కనెక్షన్‌

233
kcr review
- Advertisement -

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా గతంలో పేదలకు రూపాయికే నల్లా కనెక్షన్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్‌లో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు రూ.100కే కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.

10 లక్షల గృహాలకు కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యమని తెలిపిన సీఎం అంతా సురక్షితమైన భగీరథ నీరు తాగాలన్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. ఇప్పటి వరకు పట్టణాల్లో ఏపీఎల్‌ కుటుంబాలు కనెక్షన్‌ పొందాలంటే రూ.6 వేల డిపాజిట్, ఇంటిలోపల నల్లా పెట్టుకోవడానికి రూ.10,500లు చెల్లించాల్సి వస్తోంది. ఇంత పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించేందు ప్రజలు ముందుకురాకపోవడంతో రూ.100కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ప్రజలంతా శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని… మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల గృహాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని ఇప్పటి వరకు కేవలం 1.20 లక్షల గృహాలకు మాత్రమే కనెక్షన్లు ఉన్నాయన్నారు.

- Advertisement -